బుధవారం 03 జూన్ 2020
International - May 02, 2020 , 09:41:03

ఫెర్టిలైజ‌ర్ ఫ్యాక్ట‌రీ ఓపెన్ చేసిన కిమ్ జాంగ్‌

ఫెర్టిలైజ‌ర్ ఫ్యాక్ట‌రీ ఓపెన్ చేసిన కిమ్ జాంగ్‌


హైద‌రాబాద్‌: ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ క‌నిపించారు. 20 రోజుల బ్రేక్ త‌ర్వాత ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. నార్త్ కొరియా స్టేట్ మీడియా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఓ ఫెర్టిలైజ‌ర్ ఫ్యాక్ట‌రీ ఓపెనింగ్ కార్య‌క్ర‌మంలో కిమ్ పాల్గొన్న‌ట్లు కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ పేర్కొన్న‌ది. ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఫ్యాక్ట‌రీ ఉద్యోగులు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  శుక్ర‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  కిమ్ మ‌ర‌ణించిన‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆ దేశ మీడియా ఇవాళ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. ఏప్రిల్ 12వ‌ తేదీన చివ‌రిసారి కిమ్ ప‌బ్లిక్‌గా క‌నిపించారు.  కిమ్ రిబ్బ‌న్ క‌ట్ చేస్తున్న ఓ ఫోటోను కూడా ఉత్త‌ర కొరియా రిలీజ్ చేసింది. కిమ్ అదృశంపై అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కామెంట్ చేసేందుకు నిరాక‌రించిన విష‌యం తెలిసిందే.

 logo