సోమవారం 26 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 03:07:19

అధికారి హత్యపై కిమ్‌ క్షమాపణ

అధికారి హత్యపై కిమ్‌ క్షమాపణ

సియోల్‌: దక్షిణ కొరియాకు చెందిన ఓ అధికారిని తమ సైనికులు హతమార్చటంపై ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ఉన్‌ శుక్రవారం క్షమాపణ చెప్పారు. సరిహద్దుప్రాంత జలాల్లోకి ఇటీవల ఒక చిన్నపడవ మీద వెళ్లిన దక్షిణకొరియా అధికారి ఉత్తరకొరియా జలాల్లోకి ప్రవేశించారు. కరోనా నేపథ్యంలో సరిహద్దుల నుంచి ఎవరు అక్రమంగా ప్రవేశించినా కనిపిస్తే కాల్చివేత విధానాన్ని ఉత్తరకొరియా అమలుచేస్తున్నది. దీంట్లోభాగంగా సదరు అధికారిపై కాల్పులు జరిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని కాల్చివేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో.. క్షమాపణ చెబుతూ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌కు కిమ్‌ లేఖ రాశారు.


logo