గురువారం 28 మే 2020
International - Apr 21, 2020 , 11:39:17

కిమ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌..?

కిమ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌..?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్  ఆరోగ్యం తీవ్రంగా విషమించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కంటే... తీవ్ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. కిమ్ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని.. గ‌త నెల‌లో కిమ్ కి హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే హార్ట్ స‌ర్జ‌రీ త‌ర్వాత కిమ్ ఆరోగ్యం మ‌రింత విష‌మించింద‌ని తెలుస్తోంది. కిమ్ గ‌త కొన్ని రోజులుగా బాహ్య ప్ర‌పంచానికి దూరంగా ఉంటున్నారు. త‌న తాతా జ‌యంతి వేడుక‌ల‌కు కూడా కిమ్ హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆరోగ్యంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరోవైపు గడిచిన కొన్ని రోజులుగా కిమ్ జంగ్ ఎందుకు సైలెంటయ్యారనే విషయమై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


logo