బుధవారం 27 మే 2020
International - Apr 27, 2020 , 09:54:31

కిమ్ బాగానే ఉన్నాడ‌న్న‌ ద‌క్షిణ‌కొరియా

కిమ్ బాగానే ఉన్నాడ‌న్న‌ ద‌క్షిణ‌కొరియా

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఆరోగ్యంపై వ‌స్తున్న రూమ‌ర్స్‌ను పొరుగున‌ ఉన్న‌ ద‌క్షిణ‌కొరియా మ‌రోసారి స్పందించింది.  ఆరోగ్యం బాలేద‌ని, బ్రెయిన్‌డెడ్ అయ్యాడ‌ని, మ‌ర‌ణించాడ‌ని ఇలా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో ద‌క్షిణ కొరియా మాత్రం అలాంటి వార్త‌ల‌ను ఖండించింది. కిమ్ బతికే ఉన్నాడని నమ్ముతున్నామని, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు లేవని పేర్కొంది. అత‌నికి  ఏమీ కాలేదని దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా విశ్వసిస్తోందని అక్క‌డి అధికారులు పేర్కొన్నారు. కిమ్ ఏప్రిల్ 13 నుంచి వోన్ సాన్ ప్రాంతంలో ఉంటున్నట్టు తెలిసిందని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు కూడా తమ దృష్టికి రాలేదని వివరించారు. కాగా, తాజాగా కిమ్ వ్యక్తిగత రైలు వోన్ సాన్ ప్రాంతంలోనే నిలిచి ఉన్న శాటిలైట్ ఫొటోలు ఓ అమెరికా వెబ్ సైట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. 


logo