బుధవారం 03 జూన్ 2020
International - Apr 24, 2020 , 11:49:18

కిమ్ క్షేమమే.. సీఎన్ఎన్ వార్త తప్పన్న ట్రంప్

కిమ్ క్షేమమే.. సీఎన్ఎన్ వార్త తప్పన్న ట్రంప్

హైదరాబాద్: ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. తన బద్ధశత్రువుగా భావించే సీఎన్ఎన్ వార్తాసంస్తను తప్పుబట్టారు. పాత పత్రాల ఆధారంగా ఆ వార్తను ప్రసారం చేశారని ట్రంప్ అన్నారు. అయితే కిమ్ క్షేమంగా ఉన్నట్టు తనవద్ద ప్రత్యక్ష సమాచారం ఉందా అనే విషయమై ఆయన సమాధానం దాటవేశారు. అందుకు బదులుగా ఆయన సీఎన్ఎన్‌పై అక్కసు వెళ్లగక్కారు. కిమ్ కు శస్త్రచికిత్స జరిగిందని, ఆయన పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని పేరుచెప్పని ఓ అమెరికా అధికారిని ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఆ వార్తను ప్రసారం చేసింది. పశ్చిమదేశాల్లో వలస పొందిన ఉత్తరకొరియా ప్రవాసులు నిర్వహించే డెయిలీ ఎన్-కే అనే ఆన్‌లైన్ మీడియా సంస్థ మాత్రం కిమ్‌కు ఈ నెల ప్రారంభంలో గుండె శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన ఉత్తర ప్యోంగ్యాన్ ప్రావిన్స్ లోని ఓ విల్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపింది.


logo