శనివారం 06 జూన్ 2020
International - May 22, 2020 , 15:05:33

ఖ‌షోగ్గి హ‌త్య‌.. దోషుల‌ను క్ష‌మిస్తున్నాం

ఖ‌షోగ్గి హ‌త్య‌.. దోషుల‌ను క్ష‌మిస్తున్నాం

హైద‌రాబాద్‌: వాషింగ్ట‌న్ పోస్టు జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి.. ట‌ర్కీలో హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆ కేసులో సౌదీ ఆరేబియా అయిదుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. అయితే తాజాగా ఖ‌షోగ్గి ఫ్యామిలీ  ఓ ప్ర‌క‌ట‌న చేసింది.  త‌మ తండ్రిని చంపినవారిని క్ష‌మిస్తున్న‌ట్లు వారు పేర్కొన్నారు. దేవుడి నుంచి రివార్డు ఆశిస్తున్న‌ట్లు వారు పేర్కొన్నారు. ఖ‌షోగ్గి కుమారుడు స‌లాహా్ ఖ‌షోగ్గి త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యం చెప్పారు.  స‌లాహ్ ప్ర‌స్తుతం సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్నారు. తండ్రి హ‌త్య కేసులో స‌లాహా్‌కు సౌదీ రాయ‌ల్ కోర్టు నుంచి ప‌రిహారం అందింది.  ఇస్లామిక్ చ‌ట్టాల ప్రకారం.. ప‌విత్ర రంజాన్ మాసం వేళ‌.. తన తండ్రిని చంపిన వారికి క్ష‌మాభిక్ష పెడుతున్న‌ట్లు స‌లాహ్ త‌న ట్వీట్‌లో తెలిపారు.  మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన వారికి క్ష‌మాభిక్ష పెట్ట‌మ‌ని ఖ‌షోగ్గి కుమారులు అభ్య‌ర్థించినా.. ప్ర‌భుత్వం దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది.  2017లో ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖ‌షోగ్గిని హత్య చేశారు.logo