మంగళవారం 26 మే 2020
International - May 22, 2020 , 02:39:31

రూ.7.5 కోట్ల బంపర్‌ ప్రైజ్‌

రూ.7.5 కోట్ల బంపర్‌ ప్రైజ్‌

దుబాయ్‌: కరోనాతో దెబ్బతిన్న ఓ వ్యాపారికి అదృష్టం వరించింది. ఏకంగా మిలియన్‌ డాలర్ల లాటరీ తగిలింది. కేరళకు చెందిన నిర్మాణ రంగం వ్యాపారి రాజన్‌ కురియన్‌ దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఆయన ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన దుబాయ్‌ లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.7.5 కోట్ల బంపర్‌ ప్రైజ్‌ తగిలింది. దీంతో రాజన్‌ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా రాజన్‌ మాట్లాడుతూ.. తాను గెలుచుకున్న సొమ్మును కరోనా వల్ల దెబ్బతిన్న వ్యాపారంలో కొంత ఖర్చు చేస్తానని, కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న పేదలకు కొంత అందజేస్తానని చెప్పారు.


logo