శనివారం 30 మే 2020
International - Apr 11, 2020 , 17:36:32

దుబాయ్‌లో చిక్కుకున్న కేరళీయుడు.. గుండెపోటుతో మృతి

దుబాయ్‌లో చిక్కుకున్న కేరళీయుడు.. గుండెపోటుతో మృతి

హైదరాబాద్: దుబాయ్‌లో చిక్కుబడిన కేరళీయుడు గండెపోటుతో మరణించారు. ఎర్నాకుళంకు చెందిన శ్రీకుమార్ (70) దుబాయ్‌లో టీచరుగా పనిచేస్తున్న తన కూతురిని చూసేందుకు సతీమణితో సహా షార్జా వెళ్లారు. కానీ కరోనా లౌక్‌డౌన్‌తో విమానాల రాకపోకలు ఆగిపోవడంతో అక్కడే చిక్కుబడి పోయారు. గురువారం ఆయన ఛాతీలో నొప్పిగా ఉందని అనడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఆయన కన్నుమూశారు. గతంలో ఎర్నాకుళంలోని మహారాజా కళాశాలలో ప్రొఫెసర్‌గా ఆయన రిటైరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతికకాయాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదు కనుక అంత్యక్రియలు షార్జాలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.


logo