శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 21:20:05

కవిత గెలుపు ఖాయం: టీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ శాఖ

కవిత గెలుపు ఖాయం: టీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ శాఖ

బహ్రెయిన్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితకు అవకాశమివ్వడం పట్ల టీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ శాఖ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజా నాయకురాలైన కవితకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమివ్వడం హర్షణీయమన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కవిత భారీ మెజార్టీతో గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. 

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సలహాదారుగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె చేసిన సేవలు మరవలేనివని వారు గుర్తు చేసుకున్నారు. బతుకమ్మ, బోనాల పండుగలతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితదేనని వారన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ ప్రజాప్రతినిథులంతా కారు గుర్తుకు ఓటేసి, కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. కవితకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం పట్ల ఎన్‌ఆర్‌ఐలు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా రాధారపు సతీష్‌ తెలియజేశారు. logo