మంగళవారం 31 మార్చి 2020
International - Mar 18, 2020 , 21:56:13

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. ఆనందంలో టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ శాఖ

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. ఆనందంలో టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ శాఖ

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సలహాదారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ శాఖ సంబరాలు చేసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ శాఖ అధ్యక్షులు జయచందర్‌ గంట ఆధ్వర్యంలో వారు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ డెన్మార్క్‌ శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్‌బాబు ఆకుల మాట్లాడుతూ.. 2016లో కవిత డెన్మార్క్‌ వచ్చారనీ.. ఆమె రాకతో ప్రవాస తెలంగాణ వాసులంతా పరవశించిపోయారని అన్నారు.

బతుకమ్మ, బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో కవిత ముఖ్య భూమిక పోషించారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం.. ఆమె బతుకమ్మ వేడుకలు డెన్మార్క్‌లో జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కవిత విజయం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. 


logo
>>>>>>