గురువారం 28 మే 2020
International - Apr 17, 2020 , 11:50:31

పాతికేళ్ల క్రితం తప్పించుకున్న కశ్మీరీ ఉగ్రవాది ఆఫ్ఘ‌న్‌లో పట్టివేత

పాతికేళ్ల క్రితం తప్పించుకున్న కశ్మీరీ ఉగ్రవాది ఆఫ్ఘ‌న్‌లో పట్టివేత

హైదరాబాద్: రెండున్నర దశాబ్దాల క్రితం తప్పించుకున్న కశ్మీరీ ఉగ్రవాది ఐజాజ్ అహంగార్ అలియాస్ అబూ ఉస్మాన్ అల్‌కశ్మీరీ ఆఫ్ఘనిస్థాన్‌లో పట్టుబట్టాడు. నెలరోజుల క్రితం ఆఫ్ఘన్ భద్రతా దళాలు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ చీఫ్ అస్లం ఫరూకీని పట్టుకున్నప్పుడు అతనితోపాటే ఐజాజ్ కూడా దొరికాడు. 1990లలో ఐజాజ్‌ను ఉగ్రవాద ఆరోపణలపై కశ్మీర్‌లో అరెస్టు చేశారు. తర్వాత జైలు నుంచి విడుదలై బంగ్రాదేశ్‌కు, అక్కడి నుంచి పాకిస్థాన్ కు విమానంలో పరారయ్యాడు. సుమారు పాతికేళ్ల తర్వాత ఈనెల మొదటివారంలో ఆఫ్ఘన్ భద్రతా దళాలకు దొరికాడు. మొదట అతడిని గుర్తించలేదు. కాబూల్ గురుద్వారా దాడిన తమ పనే అని ప్రకటించుకున్న అస్లం ఫరూకీ దొరికే సరికి ఆఫ్ఘన్ దళాలు సంబరంలో పడ్డాయి. కానీ అస్లంతో పాటు దొరికిన వ్యక్తి తన పేరు అలీ ముహమ్మద్ అనీ, తాను పాకిస్థాన్ కు చెందినవాడినని చెప్తే కావచ్చునని అనుకున్నారు. అయితే ఎట్టకేలకు ఐజాజ్‌ అహంగార్‌ను ఎలా గుర్తించిందీ వివరాలు బయటికి రాలేదు. 55 ఏళ్ల వయసున్న ఐజాజ్ కశ్మీర్ లో ఐఎస్ తరఫున యువకులను చేర్చుకునే పనిలో ఉండేవాడు.


logo