ఆదివారం 07 జూన్ 2020
International - Mar 31, 2020 , 19:02:36

కరోనాతో లండన్‌లో కరీంనగర్‌ వాసి మృతి

కరోనాతో లండన్‌లో కరీంనగర్‌ వాసి మృతి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కారణంగా లండన్‌లో కరీంనగర్‌లోని సావరన్‌ వీధికి చెందిన అబ్బాస్‌ హుస్సెన్‌ (60)కన్నుమూశారు. కరోనా వైరస్‌ సోకడంతో లండన్‌ హాస్పిటల్‌ చేరిన అతడు చికిత్స పొందుతూ... రాత్రి తుదిస్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులకు, మిత్రులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కరీంనగర్‌లోని సెయింట్‌ జాన్‌ స్కూల్‌లో 10వ తరగతి చదివిన అబ్బాస్‌ 45 సంవత్సరాల క్రితం లండన్‌ వెళ్లాడు. అతడి కుటుంబ సభ్యులు, అన్నాదమ్ములు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఒక సోదరుడు మస్కట్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. logo