ఆదివారం 24 జనవరి 2021
International - Dec 22, 2020 , 12:44:53

ప్ర‌ఖ్యాత కార్య‌క‌ర్త క‌రీమా బలూచ్ మృతి

ప్ర‌ఖ్యాత కార్య‌క‌ర్త క‌రీమా బలూచ్ మృతి

టోరంటో : పాకిస్థాన్ సైన్యం, బలూచిస్థాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు. క‌రీమా మృత‌దేహం కెన‌డాలోని టోరంటోలో ల‌భ్య‌మైంది. ఆమె 2016 నుంచి కెన‌డియ‌న్ శ‌రణార్థిగా ఉన్నారు. అయితే క‌రీమాను పాకిస్థాన్‌కు చెందిన వారే హ‌త్య చేసి అక్క‌డ పడేసి వెళ్లిపోయి ఉంటార‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు. క‌రీమా భర్త హ‌మ్మ‌ల్ హైదీర్ ఫిర్యాదు మేర‌కు కెనడా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆమెను ఎవ‌రైనా హ‌త్య చేశారా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌రీమా అదృశ్య‌మైంది. ఆ త‌ర్వాత ఆమె క‌నిపించ‌లేదు. చివ‌ర‌కు టోరంటోలో క‌రీమా మృత‌దేహం ల‌భ్య‌మైంది. 2016లో ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు.  బ‌లూచిస్థాన్ లో ప్రసిద్ధ మహిళ అయిన కరీమా మహిళా క్రియాశీలతకు మార్గదర్శకురాలిగా నిలిచారు. స్విట్జర్లాండులో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో బలూచిస్థాన్ సమస్యను కరీమా లేవనెత్తారు. 


logo