గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 07, 2020 , 00:27:13

పాకిస్థాన్‌లో గ్యాస్‌లీక్‌..

పాకిస్థాన్‌లో గ్యాస్‌లీక్‌..
  • 70 మందికి అస్వస్థత

కరాచీ, మార్చి 6: పాకిస్థాన్‌లోని కరాచీ నౌకాశ్రయం ఖ్వాసింలో గల ఎంగ్రో పాలిమర్‌ అండ్‌ కెమికల్స్‌ ప్లాంట్‌లో శుక్రవారం క్లోరిన్‌ గ్యాస్‌ లీకవ్వడంతో 70 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.  అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి చికిత్స చేసి దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు జిన్నా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సెంటర్‌ (జేపీఎంసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీమిన్‌ జమాలీ తెలిపారు. తాత్కాలికంగా ప్లాంట్‌ను మూసివేసినట్లు ఎంగ్రో అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. కరాచీలో నెల రోజుల్లో ఇది రెండో గ్యాస్‌లీక్‌ ఘటన. గత నెల 16న కరాచీలో విషపూరిత గ్యాస్‌ లీక్‌ కావడంతో 14 మంది మరణించగా, ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు.


logo
>>>>>>