శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 12, 2020 , 19:25:29

పైలెట్‌ ఉద్యోగం పోయింది..కానీ ఇందులో సక్సెస్‌ అయ్యాడు..!

పైలెట్‌ ఉద్యోగం పోయింది..కానీ ఇందులో సక్సెస్‌ అయ్యాడు..!

మలేషియా: కొవిడ్‌కు ముందు అతను ఓ ప్రముఖ విమానయాన సంస్థలో పైలెట్‌. ఆరంకెల జీతం తీసుకుంటూ లైఫ్‌ను హ్యాపీగా టేకాఫ్‌ చేసేవాడు. కానీ, కొవిడ్‌ వల్ల అతడి ఉద్యోగం పోయింది. అయినా అతడు నిరాశచెందలేదు. తనకు తెలిసిన హోటల్‌ బిజినెస్‌ పెట్టి లైఫ్‌ను మళ్లీ టేకాఫ్‌ చేసుకున్నాడు. 

మలేషియాకు చెందిన అజ్రిన్ మొహమాద్ జావావి పైలట్. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 సంక్షోభం మధ్య ఉద్యోగం కోల్పోయాడు. నిరాశ చెందకుండా నూడుల్స్‌ షాప్‌ పెట్టుకున్నాడు. అయితే, అతడు పైలెట్‌గా పనిచేయనప్పటికీ అదే యూనిఫాంలో నూడుల్స్‌ షాప్‌నకు వస్తున్నాడు. కెప్టెన్‌ టోపీ ధరిస్తాడు. ఆయన గురించి తెలుసుకున్న వినియోగదారులు  కౌలాలంపూర్ వెలుపల శివారులోని తన స్టాల్‌కు క్యూకడుతున్నారు. సోషల్‌మీడియాలోనూ ఇది వైరల్‌ కావడంతో.. పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. దీనికి ‘కెప్టెన్‌ కార్నర్‌’ అని పేరుపెట్టారు. ఇక్కడ ఆహార నాణ్యతపై కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.