శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 21:36:07

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాన్యే ప్రచారం షురూ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాన్యే ప్రచారం షురూ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రఖ్యాత రాపర్‌ కాన్యే వెస్‌. దక్షిణ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్‌లో తన తొలి ఎన్నికల ప్రచార ర్యాలీని సోమవారం జరిపారు. అనంతరం ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించించి కాన్యే వెస్ట్‌ ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను తానుగా అభ్యర్థిగా కాన్యె ప్రకటించుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌ను బహిష్కరించాలంటూ తన తొలి ప్రచారాన్ని ప్రారంభించిన 43 ఏళ్ల కాన్యే వెస్ట్.. అబార్షన్, అశ్లీలత, మతం, అంతర్జాతీయ వాణిజ్యం , లైసెన్సింగ్ ఒప్పందాలు వంటి అంశాలను తన ప్రసంగంలో స్పర్శించారు. ర్యాలీకి హాజరైన వారితో పలు విషయాలపై వాదించడమే కాకుండా ఒకానొక సమయంలో కన్నీళ్లతో విరుచుకుపడ్డాడు.

‘సెక్యూరిటీ’ అని రాసివున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన కాన్యే వెస్ట్‌.. యూట్యూబ్‌లో ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా అతని తల వెనుక భాగంలో ‘2020’ అని తెలియజెప్పేలా హెయిర్‌ కటింగ్‌ చేయించుకున్నట్టు కనిపించింది. పెద్ద సంఖ్యలో ముందస్తుగా నమోదిత అతిథులు మాత్రమే వేదిక వద్దకు అనుమతించారు. సమావేశానికి ముందుకు సువార్త సంగీతం వినిపించారు. కాగా, కాన్యే వెస్ట్ ప్రసంగం గంటకు పైగా కొనసాగింది. నవంబర్‌ నెలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రకటించిన కాన్యే.. అందరికన్నా ముందుగా ప్రచారాన్ని ప్రారంభించారు.


logo