బుధవారం 27 జనవరి 2021
International - Dec 16, 2020 , 15:22:51

గుర్రాలు, శునకాల్లానే కంగారులకూ ఆ ప్రత్యేకత ఉందట..!

గుర్రాలు, శునకాల్లానే కంగారులకూ ఆ ప్రత్యేకత ఉందట..!

హైద‌రాబాద్‌:  పెంపుడు కుక్క‌ల త‌ర‌హాలోనే ఆస్ట్రేలియాకు చెందిన కంగారూ జంతువులు కూడా మ‌నుషుల‌తో భావాలు పంచుకోగ‌ల‌వ‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.  కంగారూ జంతువులు పెంపుడు శున‌కాల త‌ర‌హాలో సంకేతాలు ఇవ్వ‌గ‌ల‌వ‌ని, స‌హాయం కూడా కోర‌గ‌వ‌ల‌ని ఓ అధ్య‌య‌నంలో ప్ర‌చురించారు.   11 కంగారుల‌పై నిర్వ‌హించిన స్ట‌డీ ద్వారా ఈ విష‌యాన్ని నిర్ధారించారు.  బంధించి ఉన్న జంతువుల‌పై ప‌రిశోధ‌కులు ప్ర‌యోగాలు నిర్వ‌హించారు.  ఆహారంతో ఉన్న బాక్సును చూసిన‌ 11 జంతువుల్లో ప‌ది కంగారూలు ఆశ‌తో ఉన్న‌‌ట్లు గుర్తించారు. 

మ‌నిషితో పాటు ఫుడ్ బాక్స్‌ను క‌నీసం 9 జంతువులు ప‌దేప‌దే చూసిన‌ట్లు ప‌సిక‌ట్టారు. అంటే కంగారూలు క‌మ్యూనికేట్ చేస్తున్నాయ‌ని గ్ర‌హించామ‌ని, ఆ జంతువులు హెల్ప్ కోరిన‌ట్లు తెలుస్తోంద‌ని ప‌రిశోధ‌కుడు అల‌న్ మెక్ ఇలాయిట్ తెలిపారు. క్రూర జంతువులు సాధార‌ణంగా ఇలా ప్ర‌వ‌ర్తించ‌వ‌ని, కానీ కంగారూలు ఇలా చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు.  తాజా ప‌రిశోధ‌న‌తో కేవ‌లం పెంపుడు జంతువులు మాత్ర‌మే మ‌నిషి సంకేతాల‌ను అర్థం చేసుకోగ‌వ‌ల‌న్న అపోహలు దూరం కానున్నాయి. కుక్కలు, గుర్రాలు, మేక‌ల‌తో పాటు ఇత‌ర జంతువులు కూడా మ‌నుషుల భావాల‌ను అర్థం చేసుకోగ‌ల‌వ‌ని అర్థం అవుతోంద‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. స‌రైన వాతావ‌ర‌ణం ఉంటే, జంతువుల్లో ప్ర‌వ‌ర్త‌న అనుకూలంగా ఉంటుంద‌ని అంటున్నారు.  logo