మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 10:04:19

ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని స్వీక‌రించిన క‌మ‌లా హారిస్‌

ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని స్వీక‌రించిన క‌మ‌లా హారిస్‌

హైద‌రాబాద్‌: అమెరికా డెమోక్ర‌టిక్ పార్టీ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని క‌మ‌లా హారిస్ బుధ‌వారం అంగీక‌రించింది. ఈ నేప‌థ్యంలో ఆమె క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఫైర్ అయ్యారు.  మ‌న విషాదాల‌ను ట్రంప్ రాజ‌కీయ అస్త్రాలుగా మార్చుకుంటున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. రాబోయే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జోసెఫ్ బైడెన్‌కు ఓటు వేయాల‌ని ఆమె అమెరిక‌న్ల‌ను కోరారు.  బైడెన్ దేశాధ్య‌క్షుడు అయితే.. దేశ ప్ర‌జ‌లంద‌రినీ ఆయ‌న ఒక్క‌టి చేస్తార‌న్నారు. ట్రంప్ నాయ‌క‌త్వ వైఫ‌ల్యం.. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను, జీవితాల‌ను ప్ర‌మాదంలో నెట్టేసింద‌న్నారు.   

న‌వంబ‌ర్ 3వ తేదీన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  అయితే బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా కూడా మాట్లాడారు. ట్రంప్ పాల‌నా విధానాన్ని ఖండించిన ఆయ‌న‌.. బైడెన్‌కు ఓటెయ్యాల‌న్నారు.శ్వేత‌సౌధ ఉద్యోగాన్ని ట్రంప్ సీరియ‌స్‌గా చేస్తార‌నుకున్నాం, కానీ ఆయ‌న పాల‌న నిర్ల‌క్ష్యంగా ఉన్న‌ట్లు బ‌రాక్ ఒబామా విమ‌ర్శించారు. ట్రంప్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగింద‌ని, మ‌న ప్ర‌జాస్వామ్య సంస్థ‌ల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని ఒబామా అన్నారు.    


logo