చరిత్ర సృష్టించిన కమలాహారిస్.. మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం

వాషింగ్టన్ : అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి నల్లజాతి మహిళ, అదేవిధంగా తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా కమలాహారిస్ చరిత్ర సృష్టించారు. క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కమలాహారిస్తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణం స్వీకారం చేయించారు.
కమలాదేవి హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు, తండ్రి డోనాల్డ్ హ్యారిస్ జమైకాకు చెందినవారు. 1964 అక్టోబర్ 20 న జన్మించిన కమలా హ్యారిస్.. ఓక్ల్యాండ్లోని వెస్ట్మౌంట్ హైస్కూల్ నుంచి హైస్కూల్ విద్య, యూసీ హేస్టింగ్స్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యను, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అభ్యసించారు. కమలా హ్యారిస్ న్యాయవాదిగా సుదీర్ఘ వృత్తి జీవితాన్ని కలిగి ఉన్నారు.
WATCH: Kamala Harris takes the oath of office to become vice president, sworn in by Supreme Court Justice Sonia Sotomayor https://t.co/1LntlB7T7E pic.twitter.com/iqHQTn3qaH
— CBS News (@CBSNews) January 20, 2021
ఇవి కూడా చదవండి
కమలా హ్యారిస్.. కొన్ని ఆసక్తికర విషయాలు
అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
తాజావార్తలు
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ
- ఐసీసీ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్