మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 10:49:27

చిత్తి అన్న క‌మ‌లా హారిస్‌.. ట్రెండింగ్‌లో త‌మిళ ప‌దం

చిత్తి అన్న క‌మ‌లా హారిస్‌.. ట్రెండింగ్‌లో త‌మిళ ప‌దం

హైద‌రాబాద్‌: భార‌తీయ మూలాలు ఉన్న క‌మ‌లా హారిస్‌.. ప్ర‌స్తుతం అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ఖ‌రారైన విష‌యం తెలిసిందే. అయితే బుధ‌వారం అమెరికాలో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో క‌మ‌లా హారిస్ మాట్లాడుతూ.. చిత్తి అన్న త‌మిళ ప‌దాన్ని ఆమె ఉచ్చ‌రించారు. త‌మిళంలో చిత్తి అంటే చిన్న‌మ్మ‌ అని అర్థం. అయితే క‌మ‌లా హారిస్ నోటి వెంట ఆ మాట రాగానే.. ఇక సోష‌ల్ మీడియాలో త‌మిళులు త‌మ సంతోషం వ్య‌క్తం చేశారు.  త‌మిళులు కాని వారి కూడా గూగుల్‌లో ఆ ప‌దం కోసం బాగా సెర్చ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌మ‌లా హారిస్ త‌ల్లి  శ్యామ‌లా గోపాల‌న్‌ది త‌మిళ‌నాడులోని చెన్నై. అయితే ఆమె అమెరికా వెళ్లి అక్క‌డ జ‌మైకా దేశ‌స్థుడిని వివాహం చేసుకున్నారు. శ్యామ‌లా గోపాల‌న్ సోద‌రి త‌మిళ‌నాడులోనే నివ‌సిస్తున్నారు.  

డెమోక్ర‌టిక్ పార్టీ స‌మావేశం త‌ర్వాత త‌న త‌ల్లితో దిగిన ఫోటోల‌ను క‌మ‌లా హారిస్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.  త‌న సోద‌రి మాయతో పాటు త‌న‌లోనూ కుటుంబ విలువ‌ల ప‌ట్ల‌ త‌ల్లి శ్యామ‌లా అనేక అంశాల‌ను నూరిపోసిన‌ట్లు ఆమె చెప్పారు. మ‌నం పుట్టిన ఇంటిని, మ‌నం ఎంపిక చేసుకున్న కుటుంబంతో పాటు ఇత‌ర ప్ర‌పంచాన్ని కూడా స‌మ‌దృష్టితో చూడాల‌ని త‌న త‌ల్లి త‌మ‌కు నేర్పిన‌ట్లు క‌మ‌లా హారిస్ ఆ ట్వీట్‌లో తెలిపారు. శ్యామ‌లా సోద‌రి డాక్ట‌ర్ స‌ర‌లా గోపాలన్ చెన్నైలో ఉంటారు.  అయితే క‌మ‌లా హారిస్ ఎంపిక ప‌ట్ల ఆమె స్పందిస్తూ.. త‌మ కుటుంబం మొత్తం థ్రిల్ అయిన‌ట్లు స‌ర‌లా గోపాల‌న్ చెప్పారు. ఎప్పుడూ మెసేజ్ చేసినా.. క‌మ‌లా వెంట‌నే స్పందిస్తుంద‌ని స‌ర‌లా గోపాల‌న్ తెలిపారు.
logo