మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 11:33:10

క‌మ‌లా హ్యారిస్‌కు మ‌రోపేరు హీ జిన్ లీ..

క‌మ‌లా హ్యారిస్‌కు మ‌రోపేరు హీ జిన్ లీ..

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో భార‌తీయ మూలాలు ఉన్న క‌మ‌లా హ్యారిస్‌.. ఆ దేశ ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నికైన విష‌యం తెలిసిందే. అయితే డ్రాగ‌న్ దేశం చైనాలో ఆమెను మ‌రో పేరుతో పిలుస్తారు. సాధార‌ణంగా విదేశీ ప్ర‌ముఖుల‌ను చైనా త‌మ స్వంత పేర్ల‌తో పిలుచుకుంటుంది.  మాండ‌రిన్ భాష‌లో ఆ పేర్లు ఉంటాయి.  అమెరికా ఎన్నిక‌ల‌పై చైనా సోష‌ల్ మీడియాలో ట్రంప్, బైడెన్‌తో పాటు మ‌రో పేరు కూడా మారుమోగింది. ఆ మూడో వ్య‌క్తే క‌మ‌లా హ్యారిస్‌. కానీ చైనాలో క‌మ‌లా హ్యారిస్ పేరు.. హీ జిన్ లీ.  చైనాలో ఆమె పేరును ఉచ్చ‌రిస్తే అచ్చం ఇలాగే ఉంటుంది.  చైనాలో బైడెన్‌ను బాయి డెంగ్ అని పిలుస్తారు. అలాగే క‌మ‌లా హ్యారిస్‌ను.. చైనీయులు హీ జిన్ లి అని పిలుస్తున్నారు.  పాశ్చాత్య రాజ‌కీయ‌వేత్త‌ల‌ను చైనా త‌మ స్వంత పేర్ల‌తో పిలుచుకుంటున్న నేప‌థ్యంలో.. క‌మ‌లా హ్యారిస్ పేరు కూడా చైనాలో మారుమోగింది.  

2000 సంవ‌త్స‌రంలోనే చైనీస్ పేరును క‌మ‌లా హ్యారిస్ పెట్టుకున్నారు.  శాన్ ఫ్రాన్సిస్‌కో జిల్లా అటార్నీ జ‌న‌ర‌ల్‌గా పోటీ చేస్తున్న స‌మ‌యంలో ఆమె త‌న పేరును చైనీస్ భాష‌లో రిజిస్ట‌ర్ చేసుకున్నారు.  చైనా మీడియా క‌వ‌రేజీ కోసం ఆమె పేరు మార్చుకున్నారు.  చైనీస్‌-అమెరిక‌న్ ఫ్రెండ్ క‌మ‌లాకు చైనీస్ పేరును నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు తెలుస్తోంది. చైనా భాష ప్ర‌కారం క‌మ‌లా పేరుకు అద్భుత‌మైన అందం అన్న అర్థం వ‌స్తుంది. క‌మ‌లా చైనీస్ ఫ్రెండ్ తండ్రి ఆ పేరును పెట్టారు.  అయితే శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ప్ర‌స్తుతం కొత్త చ‌ట్టం వ‌చ్చింది. క‌నీసం రెండేళ్ల‌కు ముందు మాత్ర‌మే చైనా పేరు పెట్టుకున్న‌వాళ్లు ఆ పేరును వాడుకునే చ‌ట్టం చేశారు.  హీ జిన్ లీ పేరుతో క‌మ‌లా చైనాలో పాపుల‌ర్ అయ్యారు.