గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 13, 2020 , 20:56:00

బహ్రైన్‌లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

 బహ్రైన్‌లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

 బహ్రైన్: టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ బహ్రైన్ శాఖ ఆధ్వర్యంలో  జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన  వేడుకలు ఘనంగా జరిగాయి.   స్థానిక పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో  కేక్‌ కట్‌ చేసి స్వీట్లను పంచారు. ఈ వేడుకలకు టీఆర్‌ఎస్, జాగృతి కార్యకర్తలు   హాజరయ్యారు. ఈ సందర్భంగా  టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ బహ్రైన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బొలిశెట్టి వెంకటేశ్‌, జాగృతి ప్రెసిడెంట్‌ బాబూరావు మాట్లాడారు.  

తెలంగాణ ఉద్యమంలో కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని కొనియాడారు. తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో కవిత చాటి చెప్పారని పేర్కొన్నారు. బతుకమ్మ ప్రత్యేకతను, బోనాల విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా కవిత కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్‌, దేవన్న బాల్కొండ, కొత్తూరు సాయన్న, ఆకుల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   


logo
>>>>>>