మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 17, 2020 , 15:56:04

ఆ గ్రామ ప్రజలు తమ ఇండ్లకు నిప్పు పెట్టుకున్నారు...!

ఆ గ్రామ ప్రజలు తమ ఇండ్లకు నిప్పు పెట్టుకున్నారు...!

కల్బజార్ : వారిపై కక్షతో తమ ఇండ్లనే తగల బెట్టుకున్నారు. సొంత ఇండ్లను ఎవరైనా తగలబెడతారా...? అనే అనుమానం మీకు రావొచ్చు... కానీ ఆ ఊరిలో నిజంగానే అంతపని చేశారు. ఎందుకంటే...? అజర్ బైజాన్ దేశం నాగర్నో-కరబాక్‌లోని కల్బజార్ రీజియన్ 1994 నుంచి అర్మెనియా సైనికుల ఆధీనంలో ఉన్నది. ఇటీవల అర్మెనియా, అజర్‌బైజాన్, రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అందులో భాగంగా  కల్బజార్ రీజియన్ తిరిగి అజర్‌బైజాన్ ఆధీనంలోకి వచ్చింది. దీంతో కల్బజార్ లోనివసిస్తున్న ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి అర్మెనియాకు వెళ్లిపోయారు.

అయితే వారు తమ ఊరు విడచి వెళ్లే ముందు తమ ఇండ్లను తగలబెట్టుకున్నారు. అక్కడి ప్రభుత్వం తమని బలవంతంగా ఇండ్లను ఖాళీ చేయించిందని, ఆ ప్రాంతాన్ని తమ శత్రువులకు వదలడం ఇష్టం లేకనే ఇలా చేశామని కల్బజార్ ప్రజలు చెబుతున్నారు. తాము అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆ వర్గం ప్రజల తమ ఇళ్లను ఉపయోగిస్తారని, అందుకే వాటిని తగలబెట్టామని అంటున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.