ఆదివారం 29 మార్చి 2020
International - Mar 25, 2020 , 16:14:31

కాబూల్ ఉగ్ర‌దాడిలో 28 కి చేరిన మృతుల సంఖ్య‌

కాబూల్ ఉగ్ర‌దాడిలో 28 కి చేరిన మృతుల సంఖ్య‌

ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లోని సిక్కు ప్రార్ధ‌న‌ మందిరం గురుద్వారాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో మృతుల సంఖ్య పెరిగింది.  ఈ ఘ‌ట‌న‌లో 28 మంది మృతిచెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానిక కాల‌మానం ప్ర‌కారం  ఉద‌యం 7. 45నిమిషాల‌కు దాడి జ‌రిగింది.  సుమారు 150 మంది ప్రార్థ‌న చేస్తుండ‌గా ఆయుధాలు, బాంబులు ధ‌రించిన కొంద‌రు ముష్క‌రులు లోప‌లికి ప్ర‌వేశించి కాల్పులు జ‌రిపారు. 15 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రికొంద‌రూ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. అటు  భ‌ద్ర‌తబ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో ఓ ఉగ్ర‌వాది మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న‌కు త‌మ‌దే బాధ్య‌త అని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్ర‌క‌టించుకుంద‌ని స్థానిక మీడియా తెలిపింది.  అటు గురుద్వార‌పై జ‌రిగిన దాడిని భార‌త్ తీవ్రంగా ఖండించింది. క‌రోనాతో ప్ర‌పంచం స‌త‌మ‌త‌మ‌వుతున్న వేళ ఇలాంటి దాడులు చేయ‌డం క్రూర‌మైన చ‌ర్య‌ని పేర్కొంది. ఆప్గాన్‌లో హిందువులు, సిక్కుల ర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన సాయాన్ని అందించేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని విదేశాంగా ప్ర‌క‌టించింది. గ‌తంలో కూడా ఆప్గ‌నిస్థాన్‌లో సిక్కుల‌పై దాడి సంఘ‌ట‌న‌లో 19మంది చనిపోయారు.


logo