మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 12:33:19

వ్యాక్సిన్‌ను అంద‌రికీ ఇవ్వాలి: ట‌్రూడో

వ్యాక్సిన్‌ను అంద‌రికీ ఇవ్వాలి: ట‌్రూడో

న్యూఢిల్లీ: కరోనాకు వ్యాక్సిన్‌ను ఎవ‌రు అభివృద్ధి చేసినా అది అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్న దేశాధినేత‌ల‌ సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. తాజాగా కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో  కూడా ఆ జాబితాలో చేరారు. ఈ మేర‌కు స్పెయిన్​, న్యూజీలాండ్​, దక్షిణకొరియా, ఇథియోపియా సహా మరో మూడు దేశాలకు చెందిన అధినేత‌ల‌తో కలిసి ట్రూడో రాసిన ఆర్టికల్ ​వాషింగ్టన్​ పోస్టులో ప్రచురితమైంది. 

‘వ్యాక్సిన్‌లు ప్రాణాలను కాపాడతాయి. అందుకే క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్‌ను క‌నిపెట్టేందుకు ప్రపంచ దేశాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తున్నాయి. కాబ‌ట్టి వ్యాక్సిన్‌ను ఎవరు ముందు అందుబాటులోకి తెచ్చినా అది అందరికీ స‌మానంగా చేరాలి’ అంటూ ట్రూడో ట్వీట్​ కూడా చేశారు. తనతోపాటు ఆర్టికల్​ రాసిన ఇతర దేశాల అధినేతలను ఆ ట్వీట్‌కు ట్యాగ్​ చేశారు. 

కాగా, ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ మాన‌వుల‌పై క‌రోనా వ్యాక్సిన్​ ప్రయోగాల్లో మూడో దశకు చేరింది. అమెరికాకు చెందిన మోడెర్నా ఫార్మా కంపెనీ కూడా వ్యాక్సిన్‌ ప్రాథమిక ప్ర‌యోగాల్లో మెరుగైన ఫ‌లితాలు క‌న‌బ‌ర్చింది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్‌ను ఎవ‌రు ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చినా అంద‌రికీ స‌మానంగా ఇవ్వాల‌ని ట్రూడో పేర్కొన‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. పంచవ్యాప్తంగా 100కు పైగా సంస్థ‌లు క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు వ్యాక్సిన్లను సిద్ధం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo