మంగళవారం 26 జనవరి 2021
International - Dec 24, 2020 , 22:54:22

హఫీజ్ సయీద్‌కు 15 ఏండ్ల జైలుశిక్ష

హఫీజ్ సయీద్‌కు 15 ఏండ్ల జైలుశిక్ష

ఇస్లామాబాద్‌ : ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారికి పాకిస్తానీ కోర్టు ఒకటి  గురువారం శిక్ష 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జమాత్-ఉద్-దావా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారించిన లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) ఆయనకు జైలుశిక్షతోపాటు 2 లక్షల పాకిస్తాన్ రూపాయల జరిమానా విధించింది.

హఫీజ్ సయీద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల  బహుమతిని ఉంచింది. గత ఏడాది జూలై 17 న టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో పాకిస్తానీ పోలీసులు హఫీజ్‌ సయీద్‌ను అరెస్టు చేశారు. రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్రవాద నిరోధక కోర్టు అతనికి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నవంబర్‌లో సయీద్‌కు మరో రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో ఉగ్రవాద నిరోధక కోర్టు మరో పదేండ్ల జైలుశిక్ష విధించింది. హఫీజ్ సయీద్‌ను లాహోర్‌లోని కోట్ లఖ్పత్ జైలుకు తరలించనున్నారు. మరో నలుగురు జేయూడీ నాయకులు హఫీజ్ అబ్దుస్ సలాం, జాఫర్ ఇక్బాల్, యాహ్యా ముజాహిద్, మహ్మద్ అష్రాఫ్ లు గురువారం దోషులుగా కోర్టు తేల్చింది. దోషులుగా తేలిన ప్రతి వ్యక్తికి పీకేఆర్ 2,00,000 జరిమానా విధించారు. ఈ కేసులో సయీద్ బావమరిది అబ్దుల్ రెహమాన్ మక్కికి ఆరు నెలల జైలుశిక్ష, పీకేఆర్ 2,00,000 జరిమానా విధించింది. 

జేయూడీ నాయకులపై మొత్తం 41 కేసులను సీటీడీ నమోదు చేసింది. వాటిల్లో 28 కేసులు నిర్ధారించగా, మిగిలినవి ఏటీసీ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. సయీద్‌పై ఇప్పటివరకు ఐదు కేసులు నిర్ధారించారు. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జేయూడీ, లష్కర్-ఏ-తోయిబా (ఎల్ఈటీ) కు ముందున్న సంస్థ. ఇది 2008 ముంబై దాడిలో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మందిని చంపింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo