సోమవారం 01 జూన్ 2020
International - Apr 26, 2020 , 20:55:20

విధుల్లోకి బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్స‌న్‌

విధుల్లోకి బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్స‌న్‌

లండ‌న్: క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స్ రేప‌టి నుంచి అధికారిక కార్యక్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. వైర‌స్ ను జ‌యించిన అత‌ను.. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు డౌనింగ్ స్ట్రీట్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కాగా ఆయ‌నకు క‌రోనా సోకిన స‌మ‌యంలో మూడు వారాల పాటు చికిత్స పొంద‌గా..కొన్ని రోజులు వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. ఈ వారం రోజుల పాటు శ్రమించి వైద్యులే తనను కాపాడారని, వారికి తాను రుణపడి  ఉంటానని అన్నారు.  అధికారికంగా విధులలోకి చేరినప్పటి నుంచి బోరిస్ పలువురు ముఖ్యులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు  తెలుస్తోంది.


logo