ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 12, 2020 , 14:53:38

శ్వేతసౌధాన్ని ఆధీనంలోకి తీసుకొంటున్న జో బైడెన్‌

శ్వేతసౌధాన్ని ఆధీనంలోకి తీసుకొంటున్న జో బైడెన్‌

వాషింగ్టన్‌ : అమెరికా నూతన అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్.. శ్వేతసౌధాన్ని తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలెట్టారు. వైట్ హౌస్ చీఫ్‌గా తన పాత మిత్రుడు రాన్ క్లైన్‌ను నియమించారు. 59 ఏండ్ల క్లైన్‌ను బలమైన డెమెక్రాట్, కఠినమైన నిర్వాహకుడిగా పరిగణిస్తున్నారు. బైడెన్, క్లెన్‌ మధ్య 31 సంవత్సరాల అనుబంధం ఉన్నది. క్లెన్, బైడెన్లు పాత స్నేహితులు కూడా. బైడెన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కమలా హారిస్.. డెలావేర్‌లోని క్యాంప్ కార్యాలయంలో తమ బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. వీరి సమావేశంలో ఇద్దరికి చెందిన సలహాదారులు కూడా పాలుపంచుకుంటున్నారు.

రాన్ క్లీన్ అమెరికా ప్రసిద్ధ న్యాయవాదులలో ఒకరుగా పరిగణలో ఉన్నారు. అతను బరాక్ ఒబామా జట్టులో కూడా చేరారు. ఆ సమయంలో బైడెన్ ఉపాధ్యక్షుడుగా.. క్లైన్ తరువాత అతని ప్రత్యేక సహాయకుడిగా నియమితులైనారు. దాంతో క్లెన్‌కు వైట్ హౌస్ కొత్త ప్రదేశమేం కాదు. కరోనా వైరస్ సమస్యపై ట్రంప్ పరిపాలనను ఇబ్బంది పెట్టేందుకు క్లైన్ వ్యూహం చాలా చక్కగా పనిచేసిందని డెమోక్రాట్లు నమ్ముతారు. ఒబామా కాలంలో ఎబోలా వైరస్‌ను పరిష్కరించడానికి సరైన వ్యూహాన్ని రూపొందించి అమలుచేయడంలో ముఖ్యపాత్ర పోషించారు.

క్లెన్‌ విలువైన మిత్రుడు

రాన్‌ క్లెన్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రకటించటానికి ముందు జో బైడెన్ మాట్లాడుతూ.. రాన్ నాకు విలువైన మిత్రుడు అని చెప్పారు. 2009 ఆర్థిక సంక్షోభం, ఎబోలా వైరస్‌ను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారని రాన్‌ను బైడెన్‌ పొగిడారు. కెన్‌ అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉండి.. క్లిష్ట సమయాల్లో ఎలా పని చేయాలో తెలుసునని కితాబునిచ్చారు. ఇలాఉండగా గ్రాడ్యుయేషన్ తర్వాత బైడెన్‌తో 1989 లో డెలావేర్ నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. హోవార్డ్ లా స్కూల్ నుంచి క్లెన్‌ పట్టభద్రుడయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బైడెన్‌ ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. అమెరికా రాజకీయ వర్గాల్లో ఆయనకు చాలా గౌరవం ఉంది. కరోనా టాస్క్‌ఫోర్స్ సమావేశం, సమీక్ష ప్రారంభించాల్సి ఉన్నందున క్లెన్‌ నియామకం చాలా త్వరగా చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.