మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 04, 2020 , 10:01:43

టైట్ రేసులో.. దూసుకెళ్తున్న బైడెన్

టైట్ రేసులో.. దూసుకెళ్తున్న బైడెన్

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు న‌డుస్తోంది.  అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్‌, డెమోక్ర‌టిక్ పార్టీల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన్న‌ది.  అధ్య‌క్షుడు ట్రంప్‌,  మాజీ ఉపాధ్య‌క్షుడు బైడెన్ .. ప్ర‌తి రాష్ట్రంలోనూ నువ్వా నేనా అన్న రీతిలో పోటీప‌డుతున్నారు.  తాజా స‌మాచారం ప్ర‌కారం.. బైడెన్ ముందంజ‌లో ఉన్నారు. బైడెన్ 218 స్థానాల్లో, ట్రంప్ 148 స్థానాల‌ను కైవసం చేసుకున్నారు.  అమెరికా ఎన్నిక‌ల్లో మ్యాజిక్ ఫిగ‌ర్ 270.  న్యూ మెక్సికో, న్యూ హ్యాంప్‌షైర్‌, న్యూయార్క్‌, మాసాచుసెట్స్‌, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, వెర్మోంట్‌, క‌న‌క్టిక‌ట్‌, దిలావేర్‌, కొల‌రాడో, వాష్టింగ‌న్‌, ఓరేగాన్‌, కాలిఫోర్నియా, ఇలియ‌నాస్ రాష్ట్రాల్లో బైడెన్ విజ‌యం సాధించారు.   ఇక  అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. వ్యోమింగ్‌, క‌న్సాస్‌, మిస్సోరి, మిసిసిపీలో విజ‌యం సాధించారు.