శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 11, 2020 , 10:45:46

బైడెన్‌-హారిస్ జంట‌కు టైమ్ ప‌ర్స‌న్ ఆఫ్ ఇయ‌ర్ గుర్తింపు

బైడెన్‌-హారిస్ జంట‌కు టైమ్ ప‌ర్స‌న్ ఆఫ్ ఇయ‌ర్ గుర్తింపు

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన క‌మ‌లా హారిస్‌లు..  ఈ యేటి టైమ్ మ్యాగ్జిన్ ప‌ర్స‌న్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా ఎంపిక‌య్యారు.  ఈ విష‌యాన్ని ఆ ప‌త్రిక ప్ర‌క‌టించింది.  హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, డోనాల్డ్ ట్రంప్ పోటీ ప‌డ్డా.. డెమోక్ర‌టిక్ జంట‌కే టైమ్ గౌర‌వం ద‌క్క‌డ ంఇశేషం.  టైమ్ మ్యాగ్జిన్ క‌వ‌ర్‌పేజీపై బైడెన్‌, హారిస్ ఫోటోల‌ను ప్ర‌చురించారు.  చేంజింగ్ అమెరికాస్ స్టోరీ అన్న స‌బ్‌టైటిల్ ఆ ఫోటోకు ఇచ్చారు.  తాజాగా ముగిసిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో  బైడెన్ 306 ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్ల‌తో ట్రంప్‌ను ఓడించారు. ట్రంప్‌కు కేవ‌లం 232 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి.  రిప‌బ్లిక‌న్ నేత ట్రంప్ క‌న్నా.. బైడెన్‌కు సుమారు 70 ల‌క్ష‌ల ఓట్లు అధికంగా పోల‌య్యాయి.  ఒక క్యాలండ‌ర్ సంవ‌త్స‌రంలో అధిక ప్ర‌భావం చూపిన వ్య‌క్తుల‌ను  టైమ్ మ్యాగ్జిన్ త‌న క‌వ‌ర్‌పేజీలో ప్ర‌చురిస్తుంది.  వారినే ప‌ర్స‌న్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డుతో స‌త్క‌రిస్తున్న‌ది.