మంగళవారం 26 జనవరి 2021
International - Nov 30, 2020 , 12:28:19

పెంపుడు కుక్క‌తో ఆట‌.. కాలు విర‌గ్గొట్టుకున్న బైడెన్‌

పెంపుడు కుక్క‌తో ఆట‌.. కాలు విర‌గ్గొట్టుకున్న బైడెన్‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గాయ‌ప‌డ్డారు.  ఆయ‌న కుడి పాదం ఫ్రాక్చ‌ర్ అయ్యింది.  పాదం భాగంలో స్వ‌ల్పంగా చీలిక ఏర్ప‌డిన‌ట్లు సీటీ స్కాన్ రిపోర్ట్‌లో తేలింది.  ఇంట్లో త‌న పెంపుడు కుక్క‌తో ఆడుతున్న స‌మ‌యంలో.. బైడెన్ గాయ‌ప‌డ్డారు. దిలావేర్ ఆర్దోపెడిక్ హాస్పిట‌ల్‌కు వెళ్లిన‌ బైడెన్‌కు డాక్ట‌ర్లు తొలుత ఎక్స్ రే తీశారు. అయితే దాంట్లో ఏమీ తేల‌క‌పోవ‌డంతో సీటీ స్కాన్ చేశారు.  పెంపుడు శున‌కం మేజ‌ర్‌తో ఆడుతున్న‌ప్పుడు .. బైడెన్ కాలు విరిగిన‌ట్లు తెలుస్తోంది.  ఫ్రాక్చ‌ర్ కావ‌డం వ‌ల్ల న‌డిచేందుకు బైడెన్.. బూట్స్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వారాల పాటు వాకింగ్ బూట్ అవ‌స‌రం ఉంటుంద‌ని డాక్ట‌ర్ ఓ కాన‌ర్ తెలిపారు. కుడికాలి పాదంలో మ‌ధ్య‌భాగంలో ఉండే ఎముక‌లు స్వ‌ల్పంగా విరిగిన‌ట్లు డాక్ట‌ర్ కెవిన్ కాన‌ర్ తెలిపారు.  46వ దేశాధ్య‌క్షుడిగా జ‌న‌వ‌రి 20వ తేదీన బైడెన్ బాధ్య‌త‌లు తీసుకోవాల్సి ఉన్న‌ది.  బైడెన్ వ‌య‌సు 78 ఏళ్లు. 



logo