గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 21, 2020 , 12:17:41

జో బైడెన్ 78వ పుట్టిన రోజు..

జో బైడెన్ 78వ పుట్టిన రోజు..

హైద‌రాబాద్‌:  అమెరికా 46వ దేశాధ్య‌క్షుడిగా ఎన్నిక అయిన జో బైడెన్‌ ఇవాళ 78వ పుట్టిన రోజు జ‌రుపుకోనున్నారు. అయితే అమెరికా చ‌రిత్ర‌లో దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోనున్న అత్యంత పెద్ద వ‌య‌సు ఉన్న నేత‌గా ఆయ‌న రికార్డుకెక్కారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో దేశాధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.   గ‌తంలో రోనాల్డ్ రీగ‌న్.. 77 ఏళ్ల వ‌య‌సులో దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  1989లో రీగ‌న్ వైట్‌హౌజ్‌ను వీడారు.   ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగేళ్లు చిన్న అయిన ట్రంప్‌..  బైడెన్ వ‌య‌సు గురించి ప్ర‌చారంలో విమ‌ర్శ‌లు చేశారు.  అమెరికా చ‌రిత్ర‌లో అతిపిన్న వ‌య‌సులో అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌వారిలో జాన్ ఎఫ్ కెన్న‌డీ ఉన్నారు.  ఆయ‌న 43 ఏళ్ల వ‌య‌సులోనే దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కానీ 1963లో 46 ఏళ్ల వ‌య‌సులోనే హ‌త్య‌కు గుర‌య్యారు.