కమల్ గారాల పట్టి శృతి హాసన్ చాలా బోల్డ్‌గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఏ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడం ఆమె డిక్షనరీలో లేదు. ఇటీవల ఆర్ధిక సమస్యల గురించి చెప్పుకొచ్చిన శృతి హాసన్ తాజాగా తన న్యూ బాయ్ ఫ్రెండ్ శాంతనుతో కలిసి రచ్చ చేస్తున్నట్టు పేర్కొంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో శాంతనుతో కలిసి డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలకు బెస్టీతో లాక్డౌన్ అంటూ కామెంట్ పెట్టింది.
శృతి గతంలో విదేశాలకు చెందిన ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే. ఆయన కోసం కొన్నాళ్లు సినిమాలు కూడా మానేసింది. ఇక ఇప్పుడు శాంతనుతో చాలా సన్నిహితంగా మెలుగుతుంది. కమల్‌కు కూడా అతన్ని పరిచయం చేసింది. మరి కొద్ది రోజులలో వీరిద్దరు కలిసి ఓ మ్యూజిక్ వీడియో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా శృతి హాసన్ ఇటీవల క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ అనే చిత్రం చేస్తుంది.