ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 19, 2020 , 12:11:18

బైడెన్ గెలిస్తే ఇండియాకు న‌ష్ట‌మే: జూనియ‌ర్ ట్రంప్‌

బైడెన్ గెలిస్తే ఇండియాకు న‌ష్ట‌మే:  జూనియ‌ర్ ట్రంప్‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడిగా జోసెఫ్ బైడెన్ గెలిస్తే, ఆయ‌న వ‌ల్ల ఇండియాకు న‌ష్ట‌మే క‌లుగుతుంద‌ని, ఎందుకంటే చైనా ప‌ట్ల బైడెన్ సాఫ్ట్‌గా ఉంటార‌ని డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియ‌ర్ ట్రంప్ ఆరోపించారు.  న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల కోసం డోనాల్డ్ ట్రంప్ త‌ర‌పున 42 ఏళ్ల జూనియ‌ర్ ట్రంప్ ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ట్రంప్ ఇండియా గురించి మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోదీ, త‌న తండ్రి డోనాల్డ్ మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, వారిద్ద‌రి స్నేహాన్ని చూడ‌డం గౌర‌వంగా భావిస్తాన‌ని, వారి స్నేహం వ‌ల్ల రెండు దేశాల‌కు భ‌విష్య‌త్తులో లాభం చేకూరుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు జూనియ‌ర్ ట్రంప్ తెలిపారు.  చైనా వ‌ల్ల ఉన్న ఉప‌ద్ర‌వం గురించి మ‌నం అర్థం చేసుకోవాల‌ని,  అమెరికా-భార‌త్ క‌న్నా ఆ దేశాన్ని బెట‌ర్‌గా అర్థం చేసుకోలేర‌న్నారు.  లిబ‌ర‌ల్ ప్రివిలేజ్ అన్న పుస్త‌కం రాసిన జూనియ‌ర్ ట్రంప్‌.. త‌న బుక్‌లో జో బైడెన్ కుమారుడు హంట‌ర్ బైడెన్ అవినీతి గురించి ప్ర‌స్తావించారు.