మంగళవారం 26 మే 2020
International - Apr 25, 2020 , 09:36:32

అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాలు

అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాలు

అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. క‌రోనా వైర‌స్ ఆదేశాన్నికోలుకోలేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రంగంపై పెనుభారాన్ని చూపెడుతుంది.  అక్క‌డ ఉపాధి అవ‌కాశాల‌పై పెను ప్ర‌భావాన్ని చూపెడుతుంది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాధి మంది.. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తాజా ఉద్యోగ గణాంకాల ప్రకారం అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్టు తేలింది. 1930లో ఏర్పడిన మహామాంద్యం తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడినట్టు నిపుణులు చెబుతున్నారు. 1931-40 మధ్య నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 14 శాతానికి పైగా ఉండగా, ఇప్పుడు గరిష్ఠంగా 25 శాతంగా నమోదైంది.  ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ‌ నిరుద్యోగ భృతి కోసం 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నార‌ని తెలుస్తోంది.


logo