శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 06, 2020 , 14:18:28

లాక్ డౌన్‌తో ఉద్యోగాలు ఊస్ట్‌

లాక్ డౌన్‌తో ఉద్యోగాలు ఊస్ట్‌

లాక్ డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే చాలామంది ఇండ్ల‌కు ప‌రిమితమ‌య్యారు.చాలా సంస్థ‌లు రోజువారీ కార్య‌క‌లాపాల్ని నిలిపివేశాయి. దీంతో ఆర్థికంగా న‌ష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈనేపథ్యంలో వ్యాపార పారిశ్రామికసంఘం ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్వేలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి.

పరిశ్రమలు, సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలు లాక్‌డౌన్ కార‌ణంగా మూసివేయ‌డం ఉద్యోగుల పాలిట శాపంగా మారిపోయింది.  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి యాజ‌మాన్యాలు గట్టెక్కాలంటే.. కొలువుల కోతలే దిక్కని భావిస్తున్నాయి.  వ్య‌యాల్ని త‌గ్గించే ఆలోచ‌న‌లో పడ్డాయి. వ్యాపార పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఇదే అంశం తేలింది. లాక్ డౌన్ తర్వాత ఉద్యోగుల్ని త‌గ్గించేప‌నిలో సంస్థ‌లు ఉండ‌బోతున్నాయ‌ని స‌ర్వేలో తేలింది. ఇదే గ‌నుక జ‌రిగితే దేశంలో నిరుద్యోగం మ‌రింత‌గా పెరిగిపోయే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.


logo