శాన్ఫ్రాన్సిస్కో: సాఫ్ట్వేర్ రంగంలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) కార్పొరేషన్ ప్రెసిడెంట్ జిమ్ వైట్హర్ట్స్ తన పదవి బాధ్యతల నుంచి వైదొలిగారు.14 నెలల కిందటే ఆయన ఐబీఎం చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించారు. అతి స్వల్పకాలంలోనే ఆయన వైదొలగడం కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారింది. కంపెనీ చీఫ్ హోదా నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్నారు. రాజీనామా చేశారు. ప్రెసిడెంట్ హోదా నుంచి ఆయన తప్పుకొన్నప్పటికీ.. కంపెనీ ఛైర్మన్ అండ్ సీఈఓ అరవింద్ కృష్ణకు సీనియర్ అడ్వైజర్‌గా కొనసాగుతారు.
అమెరికన్ మల్టీనేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ రెడ్ హ్యాట్‌ను 2018లో ఐబీఎం 34 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. ఆ సమయంలో జిమ్ వైట్హర్ట్స్ రెడ్‌హ్యాట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. రెడ్‌హ్యాట్ విలీన సమయంలో ఐబీఎం సీఈఓగా పనిచేసిన గిన్నీ రొమెట్టి వైదొలగారు. తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆహోదాలో ఉన్న మరొ టాప్ఎగ్జిక్యూటివ్ అర్ధాంతరంగా తప్పుకోవడం ఇదే తొలిసారి. గిన్నీ రొమెట్టి తరువాత అరవింద్ కృష్ణ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఆయన అదే స్థానంలో కొనసాగుతున్నారు.
జిమ్ వైట్హర్ట్స్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రెడ్ హ్యాట్‌ను టేకోవర్ చేసిన తరువాత ఐబీఎంను అత్యున్నత స్థితికి చేర్చడంలో వైట్హర్ట్స్ కృషి చేశారని పేర్కొన్నారు. కాంపిటిటీవ్ కంపెనీల కంటే వ్యూహాత్మకంగా విధానాలను రూపొందించారని గుర్తు చేశారు. ఐబీఎంను టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అండ్ ఇన్నోవేషన్స్‌గా మార్చడానికి శ్రమించారని చెప్పారు.