శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 13, 2020 , 09:41:47

భారత్‌లో కరోనా పుట్టివుంటే అంతే..!

భారత్‌లో కరోనా పుట్టివుంటే అంతే..!
  • బ్రిటన్‌ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నీల్‌ వివాదస్పద వ్యాఖ్యలు


లండన్‌: ‘కరోనాను భారత్‌లో పుట్టించనందుకు దేవుడికి ధన్యవాదాలు’ అంటూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నీల్‌ వివాదస్పద వ్యాఖ్య లు చేశారు. సీఎన్‌బీసీలో బుధవారం జరిగిన చర్చలో మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా మొదలై ఉంటే ప్రభుత్వ యంత్రాంగం చైనా మాదిరిగా స్పందిం చి ఉండేది కాదన్నారు. కరోనాను చైనా నియంత్రించిన విధానాన్ని పశ్చిమదేశాలు ఆచరించాలని సూచించారు. కాగా, జిమ్‌ వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ అధికారి విశ్వేష్‌నేగి ఖండించారు. అసత్యం, బాధ్యతా రహితమైనవని విమర్శించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.


logo