మంగళవారం 14 జూలై 2020
International - May 31, 2020 , 14:33:17

తెరుచుకున్న ప్రముఖ అల్‌ అక్సా మసీదు

తెరుచుకున్న ప్రముఖ అల్‌ అక్సా మసీదు

జరూసలెం: కరోనావైరస్‌ మహమ్మారి కారణంగా రెండు నెలలుగా మూసివేయబడిన జెరూసలెంలోని అల్‌-అక్సా మసీదు, అక్కడ జరిగే సమ్మేళనం తిరిగి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇది సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా తరువాత ఇస్లాంలో మూడవ పవిత్రమైన ప్రదేశం అక్కడ ప్రభుత్వం ఇవ్వాల్టి నుంచి భక్తులకు అనుమతించడంతో తిరిగి రద్దీగా మారనుంది. 

ఈ రోజు వందలాది మంది మాస్కులు ధరించి మసీదు ద్వారాల వద్దకు వెళ్ళి ప్రార్థనలు చేయగా కొంత మంది అక్కడి నేలను ముద్దు పెట్టుకున్నట్లు బీబీసీ నివేదించింది. ఆ సమయంలో వచ్చిన వారందరిని మసీదు డైరెక్టర్‌ ఒమర్‌ అల్‌ కిస్వానీ పలకరించారు. కరోనా సమయంలో మసీదుకు రాకుండా ఓపికగా ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.logo