శనివారం 06 జూన్ 2020
International - Apr 09, 2020 , 14:36:19

ఫోర్బ్స్ సంప‌న్నుడు.. జెఫ్ బేజోస్‌

ఫోర్బ్స్ సంప‌న్నుడు.. జెఫ్ బేజోస్‌

హైద‌రాబాద్: క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ అమెజాన్ ఫౌండ‌ర్‌, సీఈవో జెఫ్ బేజోస్ ప్ర‌పంచ సంప‌న్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ త‌న 34వ‌ వార్సిక బిలియ‌నీర్ల జాబితాను రిలీజ్ చేసింది.  113 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో జెఫ్ బేజోస్ తొలి స్థానంలో నిలిచారు.  రెండ‌వ స్థానంలో 98 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో బిల్ గేట్స్ నిలిచారు.  ఎల్‌వీఎంహెచ్ సంస్థ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ .. ఫోర్బ్స్ జాబితాలో మూడ‌వ స్థానానికి ఎగ‌బాకారు. ఆయ‌న సంప‌ద 76 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది. ఇక వారెన్ బ‌ఫెట్ నాలుగ‌వ స్థానానికి ప‌డిపోయారు. బ‌ఫెట్ ఆస్తులు 67.5 బిలియ‌న్ డాల‌ర్లు ఉన్న‌ట్లు ఫోర్బ్స్ పేర్కొన్న‌ది. అయితే తాజా లిస్టులో జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ బేజోస్ చేర‌డం గ‌మ‌నార్హం.  36 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో ఆమె లిస్టులో 22వ స్థానంలో నిలిచారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల సంప‌న్నుల జాబితా నుంచి సుమారు 267 మంది ఔట‌య్యారు.  దాదాపు వెయ్యి మంది వ‌ర‌కు త‌మ ఆస్తుల‌ను కోల్పోయారు.logo