శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 11:02:07

చ‌రిత్ర సృష్టించిన అమెజాన్ సీఈవో.. బేజోస్ సంప‌ద 200 బిలియ‌న్ డాల‌ర్లు

చ‌రిత్ర సృష్టించిన అమెజాన్ సీఈవో..  బేజోస్ సంప‌ద 200 బిలియ‌న్ డాల‌ర్లు


హైద‌రాబాద్‌: అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్‌..  సంప‌న్నుల‌కే సంప‌న్నుడ‌య్యారు. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడైన బేజోస్ .. ఇప్పుడు ఓ కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.  200 బిలియ‌న్ డాల‌ర్ల(20వేల కోట్ల డాల‌ర్లు) సంప‌ద ఉన్న తొలి వ్య‌క్తిగా చ‌రిత్ర సృష్టించాడు. ఈ మైలురాయిని ఆయ‌న నిన్న దాటేశారు.  అమెరికా స్టాక్‌మార్కెట్లో అప‌ర కుబేరుడు బేజేస్ కంపెనీ దూసుకెళ్ల‌డంతో.. ఈ ఘ‌‌నత ‌ఆయ‌న సొంత‌మైంది. బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ ప్ర‌కారం.. జెఫ్ బేజోస్ మొత్తం సంప‌ద విలువ 202 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న‌ది. నిన్న ఒక్క రోజే ఆయ‌న సంప‌ద 5.22 బ‌లియ‌న్ల డాల‌ర్లు పెరిగింది. ట్రేడింగ్‌లో బేజోస్ స్టాక్‌లు రెండు శాతం వృద్ధి సాధించాయి. చాలా వ‌ర‌కు బిలియ‌నీర్లు అంద‌రూ క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో త‌మ సంప‌ద‌ను కోల్పోయారు. కానీ ఆన్‌లైన్ షాపింగ్ పెర‌గ‌డంతో బేజోస్ సంప‌ద ఇటీవ‌ల 87 బిలియ‌న్ల డాల‌ర్లు పెరిగింది.  బిల్ గేట్స్ క‌న్నా బేజోస్ సంప‌ద ప్ర‌స్తుతం 78 బిలియ‌న్ల డాల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న‌ది.  500 మంది సంప‌న్నుల ఆస్తి మొత్తంలో.. బేజోస్ సంప‌ద విలువ 3.02గా నిలుస్తుంది.  


logo