బుధవారం 27 మే 2020
International - May 24, 2020 , 01:14:29

జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు నేడే చివరి రోజు

జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు నేడే చివరి రోజు

న్యూఢిల్లీ, మే 23: ‘జేఈఈ మెయిన్‌-2020’ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ఆదివారం (మే 24) ముగియనుంది. nta.ac.in లేదా jeemain.nta.nic.in అనే వైబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసిన విద్యార్థులు అప్లికేషన్‌ పత్రంలో మార్పులు చేసుకోవడానికి ‘వన్‌ టైం ఎడిట్‌ ఆప్షన్‌' అవకాశం కల్పిస్తున్నామని, తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ సౌలభ్యం ఈ నెల 25 నుంచి 31 వరకు అందుబాటులో ఉండనున్నదని తెలిపారు.


logo