మంగళవారం 19 జనవరి 2021
International - Jan 12, 2021 , 15:28:31

ప్ర‌పంచంలో ప‌వ‌ర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఏది.. ఇండియా ర్యాంక్ ఎంత‌?

ప్ర‌పంచంలో ప‌వ‌ర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఏది.. ఇండియా ర్యాంక్ ఎంత‌?

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన పాస్‌పోర్ట్‌ల జాబితాను రిలీజ్ చేసింది హెన్లీ అండ్ పార్ట్‌న‌ర్స్. ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 జాబితాలో ఇండియా 85వ ర్యాంకుతో స‌రిపెట్టుకుంది. గ‌తేడాది 84వ స్థానంలో ఉన్న భార‌త్‌.. ఈసారి ఒక స్థానం కిందికి దిగింది. ఇందులో ఇండియాకు 58 స్కోర్ వ‌చ్చింది. అంటే ఇండియ‌న్ పాస్‌పోర్ట్‌తో 58 దేశాల‌కు ఆ దేశ వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు. ఓ టూరిస్ట్‌గా వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమ‌తించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. అంటే మీరు ఆ దేశంలో దిగిన త‌ర్వాత అక్క‌డ వీసా తీసుకోవ‌చ్చు. 

మ‌రి టాప్‌లో ఎవ‌రు?

ఈ లిస్ట్‌లో మ‌రోసారి జ‌పాన్ టాప్ ప్లేస్‌లో నిల‌వ‌డం విశేషం. జపాన్ పాస్‌పోర్ట్‌తో ఏకంగా 191 దేశాలకు వీసా లేకుండా ప్ర‌యాణించే వీలుంది. గ‌త మూడేళ్లుగా జపానే టాప్ ప్లేస్‌లో ఉంటూ వ‌స్తోంది. గ‌త రెండేళ్లు జ‌పాన్‌తో క‌లిసి తొలి స్థానంలో ఉన్న సింగ‌పూర్.. ఈసారి 190 స్కోరుతో రెండోస్థానానికి ప‌డిపోయింది. ఇక మూడోస్థానంలో సంయుక్తంగా సౌత్‌కొరియా, జర్మ‌నీ ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్ చివ‌రి స్థానంలో ఉంది. ఆ దేశ స్కోరు 26 మాత్ర‌మే. మ‌న దాయాది పాకిస్థాన్ 32 స్కోరుతో చివ‌రి నుంచి నాలుగో ర్యాంక్‌లో ఉంది.

టాప్ 10 ప‌వ‌ర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్ లిస్ట్‌: 

1. జ‌పాన్ - 191

2. సింగ‌పూర్ - 190

3. జ‌ర్మ‌నీ, సౌత్ కొరియా - 189

4. ఫిన్లాండ్‌, ఇట‌లీ, ల‌గ్జెంబ‌ర్గ్‌, స్పెయిన్ - 188

5. ఆస్ట్రియా, డెన్మార్క్ - 187

6. ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్‌, పోర్చుగ‌ల్‌, స్వీడ‌న్ - 186

7. బెల్జియం, న్యూజిలాండ్‌, నార్వే, స్విట్జర్లాండ్‌, యునైటెడ్ కింగ్‌డ‌మ్‌, అమెరికా - 185

8. ఆస్ట్రేలియా, చెక్ రిప‌బ్లిక్‌, గ్రీస్‌, మాల్టా - 184

9. కెన‌డా - 183

10. హంగ‌రీ - 182


ఇవి కూడా చ‌ద‌వండి

వాట్సాప్ మెసేజ్‌లు, అకౌంట్ ఇలా డిలీట్ చేయండి

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మూడ్ ఇదీ.. వీడియో

ప్రైవ‌సీ పాల‌సీపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్‌

క్ష‌మాప‌ణ‌లు కోరిన ఆస్ట్రేలియా కెప్టెన్ పేన్‌