బుధవారం 27 మే 2020
International - Apr 02, 2020 , 09:19:09

ప్ర‌తి ఇంటికి ఉచితంగా రెండు మాస్క్‌లు..

ప్ర‌తి ఇంటికి ఉచితంగా రెండు మాస్క్‌లు..


హైద‌రాబాద్‌: ప్ర‌తి ఇంటికి రెండు మాస్క్‌లు ఇవ్వాల‌ని జ‌పాన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే దీనిపై కొన్ని నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ఒక ఇంట్లో ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ మంది ఉన్న‌వాళ్ల ప‌రిస్థితి ఏంట‌ని కొంద‌రు ప్ర‌శ్నించారు.  కొన్ని దేశాలు న‌గ‌దు బ‌దిలీ చేస్తున్నాయ‌ని మ‌రికొంద‌రు జ‌ప‌నీయులు విమ‌ర్శిస్తున్నారు. జ‌పాన్‌లో క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య గ‌త ప‌ది రోజుల్లో మూడింత‌లు అయ్యింది. క‌ఠిన నియ‌మాలు అమ‌లు చేయ‌ని ప‌క్షంలో వైర‌స్ కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు.  ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2384 మందికి వైర‌స్ సోకింది. 57 మంది చ‌నిపోయారు.  logo