బుధవారం 27 మే 2020
International - May 19, 2020 , 06:54:16

ఉపగ్రహాల రక్షణకు జపాన్‌ అంతరిక్ష దళం

ఉపగ్రహాల రక్షణకు జపాన్‌ అంతరిక్ష దళం

టోక్యో: శత్రు దేశాల దాడి, అంతరిక్షంలోని వ్యర్థాల నుంచి తమ ఉపగ్రహాలను రక్షించుకునేందుకు కొత్తగా అంతరిక్ష రక్షణ దళాన్ని  జపాన్‌  ప్రారంభించింది. ఆ దేశ స్వీయ వాయు రక్షణ దళంలో భాగంగా 20 మందితో కూడిన స్పేస్‌ ఆపరేషన్స్‌ స్కాడ్రన్‌ను ఏర్పాటు చేసింది. అయితే రక్షణ దళంలో సభ్యుల సంఖ్యను వందకు పెంచనున్నారు. ఇది 2023 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయనుంది. జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థతోపాటు, అమెరికా స్పేస్‌ కమాండ్‌తో కలిసి పని చేస్తుంది. 


logo