శనివారం 16 జనవరి 2021
International - Dec 03, 2020 , 11:22:30

పెట్రోల్ కార్ల అమ్మ‌కాల‌‌పై జ‌పాన్ నిషేధం!

పెట్రోల్ కార్ల అమ్మ‌కాల‌‌పై జ‌పాన్ నిషేధం!

హైద‌రాబాద్‌: పెట్రోల్ కార్ల అమ్మ‌కాల‌‌పై నిషేధం విధించాల‌ని జ‌పాన్ భావిస్తున్న‌ది. మ‌రో 15 ఏళ్ల‌లో పెట్రోల్ వాహ‌నాల‌కు ఆ దేశం చెక్ పెట్ట‌నున్న‌ది.  2050 క‌ల్ల కార్బ‌న్ న్యూట్రాలిటీ చేరుకున్న ల‌క్ష్యంతో జ‌పాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  అయితే ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌ను ఆ దేశం మ‌రో వారం రోజుల్లోగా ప్ర‌క‌టించ‌నున్నారు. పెట్రోల్ వాహ‌నాల స్థానంలో.. ఎల‌క్ట్రిక్‌, హైబ్రిడ్ వాహ‌నాల‌ను ప్ర‌మోట్ చేయ‌నున్న‌ది. కర్బ‌న్ ఉద్గారాల‌ను త‌గ్గించాల‌న్న ఉద్దేశంతో జ‌పాన్ ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ట్లు ప్ర‌ధాని యోషిహిడే సుగా తెలిపారు.  జ‌పాన్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, ఐక్య‌రాజ్య‌స‌మితి స్వాగ‌తించింది. త‌క్కువ స్థాయిలో వ్యర్థాల‌ను వ‌దిలే హైబ్రిడ్‌, ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కాల‌ను 2030 లోగా 70 శాతానికి పెంచాల‌ని జ‌పాన్ భావిస్తున్న‌ది.  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం 2035 వ‌ర‌కు ఇంధ‌న వాహ‌నాల‌ను అమ్మ‌కూడ‌ద‌ని ప్ర‌క‌టించింది. 2030 క‌ల్లా పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల‌ను నిషేధించాల‌ని బ్రిట‌న్ కూడా నిర్ణ‌యించింది.