బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 04:04:49

పరిస్థితిని జటిలం కానీయొద్దు: చైనా

పరిస్థితిని జటిలం కానీయొద్దు: చైనా

బీజింగ్‌: ఎల్‌ఏసీ వెంట ఎలాంటి చర్యలు చేపట్టినా పరిస్థితి దిగజారుతుందని చైనా భారత్‌కు సూచించింది. లేహ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ స్పందించారు. చైనా పట్ల భారత్‌ తన వ్యూహాత్మక విధానంలో తప్పుడు అంచనాలు వేసుకోవటం మంచిదికాదని చెప్పారు. తమ దేశ యాప్‌లను నిషేధించటం, వస్తువుల దిగుమతికి కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఇవ్వకపోవటంపై న్యాయ పోరాటాన్ని తీవ్రం చేస్తామని చెప్పారు. కాగా, చైనా విస్తరణవాదాన్ని అనుసరిస్తున్నదన్న ప్రధాని మోదీ విమర్శలను ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్‌ తోసిపుచ్చారు. తమ 14 పొరుగు దేశాల్లో 12 దేశాలతో సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకున్నామన్నారు.

భారత్‌తో చైనా తీరు సరికాదు: జపాన్‌ 

భారత సరిహద్దుల వెంట చైనా అరాచకాలను జపాన్‌ ఖండించింది. ఏకపక్షంగా సరిహద్దును మార్చటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారత్‌లో జపాన్‌ రాయబారి సతోషి సుజుకి శుక్రవారం స్పష్టంచేశారు. భారత విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లాతో శుక్రవారం సమావేశం తర్వాత ఆయన సరిహద్దు సమస్యపై ట్వీట్‌ చేశారు. రెండు దేశాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. శ్రింగ్లాతో సమావేశం బాగా జరిగిందని తెలిపారు.  

తాజావార్తలు


logo