గురువారం 04 జూన్ 2020
International - Apr 13, 2020 , 10:56:36

జపాన్ ప్రధాని కరోనా సందేశంపై జనం రివర్స్

జపాన్ ప్రధాని కరోనా సందేశంపై జనం రివర్స్

హైదరాబాద్: ఇవి కరోనా రోజులు. ప్రపంచ వ్యాప్తంగా నేతలంతా తమతమ ప్రజలను ఇంటికే పరిమితం కావాలని సందేశాలు ఇస్తున్నారు. జపాన్ ప్రధాని షింజో ఆబే కూడా అదేవిధంగా ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. గమ్మత్తేమిటంటే దానిపై జనం రివర్స్ అయ్యారు. అందులో పాపులర్ సింగర్ జెన్ హాషినో సగం ఫ్రేములో పాట పాడుతుంటాడు. ఇంట్లోనే ఉండి హాయిగా ఆడుకో.. పాడుకో.. అనే అర్థం వచ్చే ఫేమస్ పాట అది. మిగతా సగం ఫ్రేములో ఆబే కనిపిస్తుంటారు. అంతా ఓ చిన్న షార్ట్‌ఫిల్మ్‌లా ఉంటుంది. అందులో ఆబే నింపాదిగా కూర్చుని పెంపుడు కుక్కతో ఆడుకుంటుంటారు. తర్వాత ఓ పుస్తకాన్ని తిరగేస్తారు. కూల్‌గా టీ తాగుతారు. చివరికి రిమోట్ తో టీవీ ఆపరేట్ చేస్తుంటారు. ఇదీ సీన్. ఈ సీన్ ఎందుకనో జపనీయులకు అంతగా నచ్చినట్టు లేదు. వారు ఆబేను 'నిన్ను నీవు ఏమనుకుంటున్నావు' అని నిలదీస్తున్నారు. కరోనా కల్లోలం సందర్భంగా బతుకుదెరువు కోల్పోయిన పేదప్రజల కష్టాలు పట్టలేదా అని నెటిజనులు ఆయనపై మండిపడుతున్నారు. కరోనా తెచ్చిన కష్టాలు జనజీవిచాన్ని అతలాకుతలం చేస్తుంటే హాయిగా కూర్చుని విలాసాలు పోవడమా అని ఓ నెటిజెన్ మండిపడ్డారు. కొందరు ప్రధానిని సమర్థించారు. ఆయనకు కూడా తనకంటూ కొంత సమయం ఉండాలి కదా అని వెనకేసుకొచ్చారు. ఈ లొల్లిపై ఆబే ఏమనుకుంటున్నారో మాత్రం ఇంకా తెలియరాలేదు.

<blockquote class="twitter-tweet"><p lang="ja" dir="ltr">友達と会えない。飲み会もできない。<br>ただ、皆さんのこうした行動によって、多くの命が確実に救われています。そして、今この瞬間も、過酷を極める現場で奮闘して下さっている、医療従事者の皆さんの負担の軽減につながります。お一人お一人のご協力に、心より感謝申し上げます。 <a href="https://t.co/VEq1P7EvnL">pic.twitter.com/VEq1P7EvnL</a></p>&mdash; 安倍晋三 (@AbeShinzo) <a href="https://twitter.com/AbeShinzo/status/1249127951154712576?ref_src=twsrc%5Etfw">April 12, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


logo