శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 11:23:17

రాజీనామా చేయ‌నున్న జ‌పాన్ ప్ర‌ధాని

రాజీనామా చేయ‌నున్న జ‌పాన్ ప్ర‌ధాని

హైద‌రాబాద్‌: జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఆరోగ్య కార‌ణాల దృష్ట్యా ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  అనారోగ్యం వ‌ల్ల స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దాంతో ప్ర‌ధాని ప‌ద‌విలో షింజో కొన‌సాగ‌డం క‌ష్ట‌మ‌వుతోంద‌ని ఆ దేశ జాతీయ మీడియా పేర్కొన్న‌ది. ప్ర‌ధాని షింజో అబే ఆరోగ్యం గురించి గ‌త కొన్ని వారాలుగా మీడియాలో ప్ర‌చారం సాగుతున్న‌ది. అయితే ఇటీవ‌ల ఆయ‌న రెండు సార్లు హాస్పిట‌ల్ విజిట్ చేశారు.  ఇవాళ జ‌రిగే మీడియా స‌మావేశంలో షింజో అబే త‌న రాజీనామాకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించనున్నారు. logo