మంగళవారం 26 మే 2020
International - May 01, 2020 , 17:38:38

లాక్‌డౌన్ కొన‌సాగ‌వ‌చ్చుః షింజో అబే

లాక్‌డౌన్ కొన‌సాగ‌వ‌చ్చుః షింజో అబే

జ‌పాన్‌లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్ మ‌రింత కాలం పొడిగించాల్సి రావ‌చ్చ‌ని ప్ర‌ధాని షింజో అబే సంకేతాలిచ్చారు. ఆ దేశంలో నెల‌రోజులుగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 6వ తేదీతో ముగుస్తుంది. ఆ త‌ర్వాత కూడా లాక్‌డౌన్ కొన‌సాగ‌వ‌చ్చ‌ని అందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. లాక్‌డౌన్ పొడిగింపుపై నాలుగో తేదీన నిపుణుల‌తో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. విదేశాల్లో మాదిరిగి మ‌న దేశంలో కోవిడ్‌-19 విజృంభించ‌కుండా స‌హ‌క‌రించిన ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. కానీ ఇప్ప‌టికీ ప‌రిస్థితి క‌ఠినంగానే ఉంది. మ‌న దేశంకోసం మ‌రికొంత కాలం ఇలాగే స‌హ‌క‌రించ‌టం అవ‌స‌రం అని పేర్కొన్నారు.


logo